పవన్ కు సినిమా ఛాన్స్..హీరోగా బెల్లం కొండ రెండో కొడుకు తెలుగు తెరకు పరిచయం..?

కొంతమంది డైరెక్టర్స్ కి డెబ్యూ సినిమా తెరకెక్కించడానికి పెద్ద నిర్మాణ సంస్థలు సపోర్ట్ చేస్తాయి. ఒక మోస్తారు ఫేం ఉన్న హీరో హీరోయిన్స్ కూడా దొరుకుతారు. అయితే ఆ సినిమా సక్సస్ మీదే వీళ్ళ కెరీర్ ఉంటుందనేది మాత్రం వాస్తవం. ఇలాంటి డైరెక్టరే పవన్ సాధినేని. తను తెరకెక్కించిన మొదటి సినిమా ప్రేమ ఇష్క్ కాదల్. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు నిర్మాణంలో బెక్కం వేణు గోపాల్ నిర్మించారు. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాదు పవన్ కి కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. కానీ ఈ సినిమా తర్వాత పవన్ కి మళ్ళీ సినిమా ఛాన్స్ రావడానికి దాదాపు మూడేళ్ళు పట్టింది. నారా రోహిత్ నందిత జంటగా సావిత్రి ని తెరకెక్కించాడు.
ఆ సినిమా ఫ్లాప్ అవడంతో మళ్ళీ కనపడలేదు. 2016 తర్వాత పవన్ మళ్ళీ ఇన్నాళ్ళకు దర్శకత్వం వహించే అవకాశం వచ్చినట్టు తాజా సమాచారం.

పవన్ సాధినేని సినిమా అవకాశం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న యువ దర్శకుడు. దాదాపు మూడేళ్లు కావస్తోంది మెగా ఫోన్ పట్టుకుని. మళ్లీ ఇన్నాళ్లకు చాన్స్ దొరికింది. బెల్లంకొండ సురేష్ రెండో కొడుకు సాయిగణేష్ ను హీరోగా పరిచయం చేసే సినిమాకు పవన్ సాధినేని దర్శకుడిగా ఎంపికయ్యారని ఫిల్మ్ నగర్ సమాచారం. మంచి యూత్ ఫుల్ ప్రేమకథతో బెల్లంకొండ చిన్న కొడుకును తెరకు పరిచయం చేయబోతున్నాడట.

సావిత్రి సినిమా తరువాత పవన్ సాధినేని సరైన ప్రాజెక్టు కోసం చూస్తున్నారు. అంతకముందు కళ్యాణ్ రామ్ కోసం ఓ మల్టీ స్టారర్ భారీ కథ తయారుచేసి, ఎన్.టి.ఆర్ట్స్ లోనే చాలాకాలం ఎదురు చూశారు. అంతేకాదు ఈ సినిమాలో హరికృష్ణకు కూడా కీలకపాత్ర తయారుచేసారు. కానీ ఆ తరువాత పరిస్థితులు అన్నీ మారిపోయి, ఆ ప్రాజెక్టు ముందుకు కదలలేదు. ఇలాంటి నేపథ్యంలో పవన్ సాధినేని చెప్పిన కథను బెల్లంకొండ సురేష్ ఓకె చేసి, తన చిన్న కొడుకును తెరకు పరిచయంచేసే బాధ్యతను అప్పగించినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాకు నిర్మాతగా సురేష్ నే వ్యవహరిస్తారు కానీ, పేరు ఎవరిది వుంటుందోనని ఇన్‌సైడ్ టాక్. మరి ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నిలదొక్కుకునే పనిలో ఉన్నాడు.

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: Telugu Ap Herald

(Visited 10 times, 1 visits today)
The Logical News

FREE
VIEW
canlı bahis