గ్రహం అనుగ్రహం (23-08-2019)

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం,తిథి బ.అష్టమి రా.3.18 వరకు, తదుపరి నవమి నక్షత్రం కృత్తిక రా.12.03 వరకు, తదుపరి రోహిణి వర్జ్యం ప.11.37 నుంచి 1.16 వరకు, దుర్ముహూర్తం ఉ.8.16 నుంచి 9.06 వరకు,తదుపరి ప.12.27 నుంచి 1.17 వరకుఅమృతఘడియలు…రా.9.33 నుంచి 11.12 వరకు.గోకులాష్టమి

సూర్యోదయం : 5.47
సూర్యాస్తమయం : 6.19
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుంచి 4.30 వరకు

భవిష్యం
మేషం:ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపండి. దైవదర్శనాలు. వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి.ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు.

వృషభం:బంధువులను కలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభం. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు.

మిథునం:ఆదాయం పెరిగి రుణాలు తీరుస్తారు. బంధువుల చేయూతతో వ ్యవహారాలు పూర్తి చేస్తారు. కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

కర్కాటకం:చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి.

సింహం:ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార లావాదేవీలలో పురోగతి. ఉద్యోగులకు ఉన్నతస్థితి.

కన్య:ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు. భూవివాదాలు నెలకొంటాయి. మిత్రులతో స ్వల్ప విభేదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

తుల:కుటుంబసమస్యలు. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. బంధువులు,మిత్రులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగులకు ఊహించని బదిలీలు.

వృశ్చికం:ఇంటాబయటా ఎదురుండదు. పరపతి పెరుగుతుంది. కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. రాబడి పెరుగుతుంది. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

ధనుస్సు:యత్నకార్యసిద్ధి. అందర్నీ ఆకట్టుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు. ధన, వస్తులాభాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

మకరం:కొన్ని పనులు మందకొడిగా సాగుతాయి. ప్రయత్నాలు ముందుకు సాగవు. ఆదాయం కొంత నిరాశ పరుస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

కుంభం:ప్రయాణాలలో అవరోధాలు. ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. ఇంటాబయటా ఒత్తిడులు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో మార్పులు సంభవం.

మీనం:అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సందేశం. విందువినోదాలు. ఆస్తిలాభం. ఉద్యోగయోగం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పురోగతి. – సింహంభట్ల సుబ్బారావు

Sakshi

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: Sakshi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *