సీబీఎస్ఈ కి వార్నింగ్ ఇచ్చిన తమిళ్ నాడు

పిల్లలకు మంచి చెడు నేర్పించేది స్కూల్. పిల్లలు ఇంట్లో కన్నా స్కూలు లోనే ఎక్కువ సమయం గడుపుతారు. అలాంటి విద్యాసంస్థలలో మంచిని నేర్పుతూ పిల్లలను ప్రయోజకులను చేస్తున్నారు అన్న నమ్మకంతో తల్లిదండ్రులు స్కూళ్లకు పంపిస్తూ ఉంటారు. కానీ అక్కడ ఎటువంటి పాఠాలు చెబుతున్నారు ఏమి చెబుతున్నారో అసలు పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు అన్న విషయం పైన తల్లిదండ్రులకు అంతగా అవగాహన ఉండదు. ప్రతి చిన్న విషయం మీద ఒక కన్నేసి ఉంచడం అనేది సాధ్యం కాని పని. ఇప్పుడు సీబీఎస్ఈ పుస్తకాలలో పిల్లలకు ఇవా నేర్పిస్తున్నారు అని అందరూ కంగుతిన్నారు.

తాజాగా తమిళనాడులో ఇది వెలుగులోకి వచ్చింది సీబీఎస్సీ ఆరవ తరగతి సోషల్ సైన్స్ పుస్తకాలలో ముస్లింల మీద మరియు దళితుల మీద వ్యంగ్యంగా వ్యాఖ్యానాలు చేశారు.
దళితులు అంటే ఎవరు అనే ప్రశ్నకు సమాధానంగా వాళ్ళు ఫారినర్స్ ఆ? లేక అంటరానివాళ్ళ? లేక మధ్యతరగతి వాళ్ళ? లేదా పేద వాళ్ళ? అని అడిగినట్టు గా కనిపిస్తుంది.

మతం గురించి చెడు ప్రచారం చేయడం అలాగే కుల వ్యవస్థను పెంచి పోషించే విధంగా పిల్లలకు ఎటువంటి చదువులు చెప్పడం ఎంతవరకు సబబు అని తమిళనాడులో అందరూ ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఇటువంటివి మరలా కనిపిస్తే ఊరుకునేది లేదు అని సీబీఎస్ఈ అసలు తమిళనాడులో పెట్టడానికి వీలు లేకుండా చేస్తామని హెచ్చరించారు.

ఈ విషయం పైన ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న స్టాలిన్ మాత్రమే కాదు ప్రతిపక్షంలో ఉన్న వారు సైతం దుమ్మెత్తిపోస్తున్నారు. అసలు కేంద్ర ప్రభుత్వం సీబీఎస్ఈ సిలబస్ కేంద్రీయ విద్యాలయాలు తమిళనాడులో ఇటువంటివి జరుగుతుండగా చోద్యం చూస్తున్నారు అని, అసలు ఇటువంటి ప్రశ్నలు చేసిన వాళ్ళు ఎవరు అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నలను వెంటనే తీసివేయడం మే కాకుండా దీనికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు స్టాలిన్. నేను అసలు ఇవి మొదట చూసినప్పుడు షాక్ అయ్యాను అని అసలు ఇవి పిల్లలకు నేర్పించే విషయాలే నా అని స్టాలిన్ వ్యాఖ్యానించారు.

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: Telugu Ap Herald

One thought on “సీబీఎస్ఈ కి వార్నింగ్ ఇచ్చిన తమిళ్ నాడు

  • December 11, 2019 at 9:14 am
    Permalink

    738174 558331bless you with regard to the particular blog post ive truly been looking regarding this kind of details on the internet for sum time correct now as a result cheers 759870

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *