వైసీపీ ఎమ్మెల్యేకు రేషన్ బియ్యం : ఇంటికెళ్లి అప్పగించిన వలంటీర్‌: ఏం జరిగిందంటే..!!

Spread the love

తెల్ల రేషన్ కార్డు ఎవరికి ఉండాలి. ఎమ్మెల్యే తెల్ల రేషన్ కార్డుకు అర్హులా. ఎమ్మెల్యే అని తెలిసి మరీ వాలంటీర్ ఆయన ఇంటికి వెళ్లి మరీ రేషన్ బియ్యం ఎలా ఇచ్చారు. తనకు అప్పగించిన పని అప్పగించారా. లేకుంటే ఎమ్మెల్యేతో గొడవ ఎందుకనుకున్నారా. అయితే..ఆ ఎమ్మెల్యే అసలు తనకు తెల్ల రేషన్ కార్డు ఉందన్న సంగతే తెలియదని చెబుతున్నారు. దీని మీద విచారణకు ఆదేశిస్తామంటున్నారు. నేరుగా దరఖాస్తు చేస్తే గానీ..తెల్ల రేషన్ కార్డు ఎవరికీ దక్కదనే విషయాన్ని అప్పుడే ప్రతిపక్షాలు ప్రస్తావిస్తున్నాయి. ఇప్పుడు ఇదే వ్యవహారం రాజకీయంగా విమర్శలకు కారణమైంది. ఎమ్మెల్యే వివరణ ఇచ్చుకున్నా ఆ విషయం పైన ఇంకా చర్చ సాగుతూనే ఉంది. మరి..తెల్ల కార్డు లేదని చెబుతున్న ఆ ఎమ్మెల్యే తన ఇంట్లో బియ్యం వద్దని చెప్పారా..లేదా ఇప్పుడు దీని పైన చర్చ మొదలైంది.
అసలు..ఎమ్మెల్యేకు తెల్ల రేషన్ కార్డు..రేషన్ బియ్యం..విమర్శలు..ఏం జరిగిందంటే…

వైసీపీ ఎమ్మెల్యేకు రేషన్ బియ్యం…

శ్రీకాకాకుళం జిల్లా పాలస ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు. ఆయనకు తెల్ల రేషన్ కార్డు ఉండటం.. ప్రభుత్వం నియమించిన వాలంటీర్ నేరుగా ఆయన ఇంటికి వెళ్లి రేషన్ బియ్యం ఇవ్వటం..ఇప్పుడు వివాదా స్పదమైంది. ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తికి తెల్ల రేషన్ కార్డు ఎలా వచ్చింది. ఎమ్మెల్యే అని తెలిసి వాలంటీర్ ఇంటికి వెళ్లి మరీ బియ్యం ఎలా ఇచ్చారనేది ఇప్పుడు చర్చ. దీని పైన వెంటనే ఎమ్మెల్యే స్పందించారు. వివరణ ఇచ్చారు. అసలు తనకు తెల్ల రేషన్ కార్డు ఉన్న సంగతే తెలియదంటున్నారు. దీని పైన విచారణకు ఆదేశిస్తానని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే అప్పలరాజు పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని జీఎం ఈ రియల్‌ ఎస్టేట్స్‌లో నివాసం ఉంటున్నారు. ఆయన పేరిట రేషన్‌ కార్డు ఉండడంతో వలంటీర్‌ ఎస్‌.ప్రసాద్‌ ఆదివారం ఎమ్మెల్యే ఇంటికెళ్లి రేషన్‌ అందించారు. ఇది స్థానికంగా చర్చనీయాంశం కావడంతో ఆయన కుటుం బ సభ్యులతో కలిసి రేషన్‌ అందుకున్న ఫొటోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి వివరణ ఇచ్చుకున్నారు. తనకు తెల్లకార్డు ఉందన్న విషయం తెలీదని చెప్పారు. ఒకవేళ కార్డు ఉంటే ఇన్నాళ్లూ రేషన్‌ తీసుకోనందుకు అది కేన్సి ల్‌ కావాలి కదా అని ప్రశ్నించారు.

ఎమ్మెల్యేపై విమర్శల వెల్లువ..

అధికార పార్టీ ఎమ్మెల్యే రేషన కార్డు కలిగి ఉండటంతో పాటుగా..పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యం తీసుకోవటం పైన విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. అయితే, ఎమ్మెల్యే మాత్రం వాలంటీర్ నేరుగా ఇంటికే బియ్యం తెచ్చి ఇచ్చారని..ఇది వారి పారదర్శకతకు..వారి పనితీరుకు నిదర్శనమంటూ వివరించారు. దీని పైనే నెటిజెన్లు విమర్శలు గుప్పించారు. జనసేన నాయకుడు డాక్టర్‌ దుర్గారావు వాట్సా్‌పలో దీనిపై స్పందిస్తూ తెల్లరేషన్‌ కార్డు కావాలంటే నేరుగా దరఖాస్తు చేస్తేగాని రాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఎమ్మెల్యేను ఉద్దేశించి కామెంట్ చేసారు. దీని పైన రేఫన్ డీలర్ సైతం స్పందించారు. డాక్టర్ అప్పలరాజు గతంలో అక్కడ నివాసం ఉన్న సమయంలో తెల్ల రేషన్ కార్డు వచ్చిందని..అయితే ఆదాయ పన్ను కడుతున్న తనకు కార్డు వద్దని..తొలించాలని అభ్యర్ధించాంటూ చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే అప్పల రాజు మాత్రం తాను దీని పైన అధికారుల వివరణ కోరానని, డీలరు వద్ద డేటాలో తన పేరు తిరస్కరించిన జాబితాలో ఉం దని, విచారణకు ఆదేశిస్తానని స్పష్టం చేసారు. ఇప్పటికే బియ్యం పంపిణీలో నాసి రకం బియ్యం అనేక ప్రాంతాల్లో సరఫరా చేసారనే ఆరోపణల నడుమ..ఇప్పుడు ఎమ్మెల్యేకు తెల్ల రేషన్ కార్డు..బియ్యం పంపిణీ పైన ఇంకా ఎటువంటి రాజకీయ విమర్శలు మొదలవుతాయో చూడాలి.

source: oneindia.com

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: OneIndia Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *