పాండ్యపై జహీర్‌ బౌన్సర్‌ పంచ్‌

ముంబయి: టీమిండియా మాజీ పేసర్‌ జహీర్‌ఖాన్‌ యువ ఆటగాడు హార్దిక్‌ పాండ్యపై బౌన్సర్‌ సంధించాడు. తన పుట్టిన రోజున చేసిన ట్వీట్‌కు బదులుగా అతడు హాస్యభరితంగా ఓ పంచ్‌ విసిరాడు. ఈ నెల 7న జాక్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతడికి పాండ్య వినూత్నంగా అభినందనలు తెలిపేందుకు ప్రయత్నించాడు. అదికాస్తా బెడిసికొట్టడంతో అభిమానులు సెటైర్లు వేశారు. ‘హ్యాపీ బర్త్‌డే జాక్‌… ఇక్కడ నేను చేసినట్టే నువ్వూ బంతిని పార్క్‌ దాటిస్తావని ఆశిస్తున్నా’ అని పాండ్య ఓ వీడియోను ట్వీట్‌ చేశాడు. అందులో జహీర్‌ వేసిన బంతిని హార్దిక్‌ సిక్సర్‌గా మలిచాడు. ఇలా అనడం అభిమానులకు రుచించలేదు. కాస్త మర్యాద నేర్చుకోవాలని హితవు పలికారు.
ఈ ట్వీట్‌కు జాక్‌ సమయ స్ఫూర్తితో బదులిచ్చాడు.

‘హ్హహ్హహ్హ.. శుభాకాంక్షలకు ధన్యవాదాలు హార్దిక్‌ పాండ్య. నా బ్యాటింగ్‌ ఎప్పటికీ నీ అంత బాగుండదు. అయితే నా బర్త్‌డే మాత్రం ఆ మ్యాచ్‌లో నువ్వు ఎదుర్కొన్న తర్వాతి బంతంత బాగుంటుంది’ అని జహీర్‌ ట్వీట్‌ చేశాడు. బ్రిటన్‌లో వెన్నుకు శస్త్రచికిత్స చేయించుకున్న పాండ్య ప్రస్తుతం అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నాడు. బుడిబుడి అడుగులు వేస్తున్నాడు. చక్రాల కుర్చీ సాయంతో అటుఇటు తిరుగుతున్నాడు. ‘బుడిబుడి అడుగులు.. నా పూర్తి ఫిట్‌నెస్‌కు ఆరంభం మొదలయ్యేది ఇక్కడి నుంచే. మీ అభిమానానికి, మద్దతుకు ధన్యవాదాలు’ అని పాండ్య దసరా రోజున ఓ వీడియో పోస్ట్‌ చేశాడు.

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: Eenadu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *