ఏపీలో ప్రతిపక్షాల సత్తా ఇప్పుడు తెలిసి పోతుందా…?

రాష్ట్రంలో విపక్షాల సత్తా ఎంత? వారు ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు, రాజకీయంగా పుంజుకుంటామని, ప్రజల్లో తమకే మద్దతుందని చెబుతున్న వ్యాఖ్యలు వంటివి ఏమేరకు నిజం? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం వచ్చే ఆది వారం స్పష్టం కానుంది. సమస్య ఒక్కటే అయినప్పుడు అందరూ కలిసి పోరాడదాం..! పక్కరాష్ట్రం తెలంగాణలో ఆర్టీసీ సమ్మె విష యంలో అక్కడి ప్రభుత్వంపై విపక్షాలు చేసిన తరహాలో యుద్ధం చేద్దాం.. అంటూ జనసేనాని పవన్ పిలుపు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆయన టీడీపీ, బీజేపీల చీఫ్‌లకు స్వయంగా ఫోన్లు చేసి.. తాను వచ్చే ఆదివారం చేపట్టనున్న విశాఖ లాంగ్ మార్చ్‌కు హాజరుకావాలని ఆయన ఆహ్వానించారు.

దీంతో ఇప్పుడు ఈ మూడు పార్టీలూ కలుస్తాయా?
కలిసి విశాఖ లాంగ్ మార్చ్‌ను విజయవంతం చేయడం ద్వారా తామంతా కలిసే ఉన్నామని, జగన్ ప్రభుత్వానికి సందేశం పంపుతాయా? అనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు పవన్ ఆహ్వానాన్ని మన్నిం చాలా? వద్దా? అనే విషయంలో ఈ రెండు పార్టీలూ డైలమాలో పడ్డాయని అంటున్నారు. పట్టుమని ఐదు మాసాలకు ముందు ఒకరిపై ఒకరు సంఘర్షణ చేసుకుని, విమర్శలు రువ్వుకుని.. ఇప్పుడు ఇసుక కోసం కలిసిపోవడం కరెక్టేనా? ప్రజలకు ఎలాంటి మెసేజ్ వెళ్తుందనే పరిస్థితి ఈ రెండు పార్టీల్లోనూ ముఖ్యంగా టీడీపీ విషయంలో ప్రధాన పరీక్షగా మారింది. మరోపక్క, పవన్‌కు కూడా సంకట స్థితే!

తానే స్వయంగా ఆహ్వానించినా.. తను పిలుపు నిచ్చిన విశాఖ లాంగ్ మార్చ్కు ప్రధాన పార్టీలు సహకరించకపోతే.. భవిష్యత్తులో ఆయన ఒంటరిగానే మిగిలిపోవాల్సి ఉంటుంది. రాజకీయంగా ఆ రెండు పార్టీలకు ఆయన సమానదూరంలో నిలిచిపోవడం ఖాయం. ఇది ఇజ్జత్‌కా సవాల్‌గా మారిపోతుంది. ఆ రెండు పార్టీలు పొత్తుతో ఎన్నికల్లోకి వెళ్లినప్పుడు తనను ఆహ్వానిస్తే.. వచ్చి ప్రచారం చేశారు. గెలిపించారు. ఇప్పుడు పవనే స్వయంగా పెద్ద నిరసన చేపట్టి, తానే స్వయంగా ఆహ్వానిస్తే.. వారు వస్తారా? రాకపోతే.. ఇక… పవన్‌కు అటు ప్రజల్లోనే కాకుండా.. తను గతంలో మద్దతిచ్చిన పాత మిత్రులు కూడా దూరమవుతారా? అనేది చర్చ నీయాంశంగా మారింది.

ఇక, బీజేపీ విషయానికి వస్తే.. సొంతంగానే ఎదుగుతాం.. సొంతగానే అధికారంలోకి వస్తాం.. అంటూ ప్రతిజ్ఞలు చేసిన కమల నాధులు ఇప్పుడు పోయి పోయి పవన్ పిలుపు మేరకు ఆ నిరసనలో పాల్గొంటే.. క్రెడిట్ పవన్‌కు సొంత మైతే.. పరిస్థితి ఏంటి? పైగా ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని తూర్పారబట్టిన పవన్‌తో చేతులు కలపడం అంటే.. ప్రమాదకర సంకేతాలను పంపినట్టేగా? అనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే భవిష్యత్తుకు, రాష్ట్రంలో విపక్షాల సత్తాకు ఈ విశాఖ లాంగ్ మార్చ్ ఓ సంకేతంగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: Telugu Ap Herald

2 thoughts on “ఏపీలో ప్రతిపక్షాల సత్తా ఇప్పుడు తెలిసి పోతుందా…?

 • December 15, 2019 at 11:03 am
  Permalink

  28271 314657Some genuinely superb weblog posts on this website , regards for contribution. 334118

  Reply
 • January 16, 2020 at 4:34 am
  Permalink

  595786 763507A blog like yours ought to be earning significantly cash from adsense.~::- 129974

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *