తొలుత బ్యాటింగ్‌లో భారత్ మెరుగవ్వాలి

టీమ్‌ ఇండియా బ్యాటింగ్ విక్రమ్‌ రాఠోడ్‌

దిల్లీ: దిల్లీలో కాలుష్య సమస్య ఉన్నా, షెడ్యూల్‌ ప్రకారమే తొలి టీ20 ఆడతామని టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌ పేర్కొన్నారు. ‘నా క్రికెట్‌ కెరీర్‌ మొత్తం ఉత్తర భారత్‌లోనే సాగింది. దిల్లీలో కాలుష్య సమస్య ఉంది. కానీ, మ్యాచ్‌ను ఆడతాం. షెడ్యూల్‌ ప్రకారమే అరుణ్‌జైట్లీ స్టేడియంలో తొలి టీ20 జరుగుతుంది. మ్యాచ్‌ కోసం బరిలోకి దిగినప్పుడు కాలుష్య సమస్యలు గుర్తుకురావు. ఇది ఆరోగ్య పరమైన అంశమైనప్పటికీ, మ్యాచ్‌ ఆడటానికి వచ్చాం కాబట్టి ఆడాల్సిందే’ అని విక్రమ్‌ తెలిపారు. గత టీ20ల్లో భారత్ తొలుత బ్యాటింగ్‌ చేసినప్పుడు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు.
‘టీ20ల్లో తొలుత బ్యాటింగ్‌ దిగినప్పుడు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాం. మరింతగా రాణించాలి. దీనిపై దృష్టిసారిస్తున్నాం. ఛేదనలో అద్భుతంగా బ్యాటింగ్‌ చేస్తున్నాం. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని జట్టులో భారీ మార్పులు చేయకూడదు. కీలక ఆటగాళ్లను జట్టులోనే ఉంచుతూ కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇస్తుండాలి. వారు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే టీమ్‌ఇండియా మరింత పటిష్ఠంగా తయారవుతుంది’ అని అన్నారు.

మూడు టీ20ల సిరీస్‌లలో భాగంగా ఆదివారం అరుణ్‌జైట్లీ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో భారత్‌ తొలి మ్యాచ్‌ను ఆడనుంది. అయితే దిల్లీలో కాలుష్య తీవ్రత అధికంగా ఉండటంతో మ్యాచ్‌ నిర్వహణపై పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. కానీ, షెడ్యూల్‌ ప్రకారమే మ్యాచ్‌ జరుగుతుందని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ పేర్కొన్న విషయం తెలిసిందే.

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: Eenadu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *