ఆకట్టుకుంటున్న మలబార్‌ వెడ్డింగ్‌ జ్యూయలరీ ప్రదర్శన

హైదరాబాద్‌: పెళ్లిళ్ల సీజన్‌ వచ్చిందంటే చాలు నగల దుకాణాలు, వస్త్ర దుకాణాలు కళకళ లాడుతుంటాయి. కొనుగోలు దారులను ఆకట్టుకునేందుకు దుకాణదారులు కూడా రకరకాల డిజైన్లను అందుబాటులోకి తీసుకొస్తుంటారు. ఇందులో భాగంగానే బంగారు ఆభరణాల సంస్థలు సరికొత్త డిజైన్లను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. హైదరాబాద్‌ సోమాజీగూడలో మలబార్‌ వెడ్డింగ్‌ జ్యూయలరీ పేరిట నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంటోంది. పలువురు మోడల్స్‌ బంగారు ఆభరణాలను ధరించి మెరిసిపోయారు. పెళ్లి కుమార్తెకు కావల్సిన అన్ని రకాల నగలు, ఆభరణాలు ఒకే చోట అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: Eenadu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *