కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

హయత్‌నగర్‌ (హైదరాబాద్‌): హైదరాబాద్‌ – విజయవాడ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టింది. హైదరాబాద్‌ నుంచి కొత్తగూడెం వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. పెద్దఅంబర్‌పేట అవుటర్‌ రింగ్‌రోడ్డు కూడలి సమీపంలో యూ టర్న్‌ తీసుకుంటున్న కారును వెనుక నుంచి ఢీకొట్టింది. అనంతరం బస్సు అదుపు తప్పి డివైడర్‌ మీదకు దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ మద్యం సేవించి ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: Eenadu

One thought on “కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *