గన్‌పార్క్‌ వద్ద అఖిలపక్ష నేతల మౌనదీక్ష

హైదరాబాద్‌: మంత్రి మండలి సమావేశంలో ఆర్టీసీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం ముందు గంట పాటు అఖిలపక్ష నాయకులు మౌనదీక్షకు దిగారు. దీక్షలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకట్ రెడ్డి, తమ్మినేని వీరభద్రం, తెదేపా సీనియర్ నాయకుడు రావుల చంద్రశేఖర్, ఆర్టీసీ ఐకాస నేతలు అశ్వద్ధామరెడ్డి, రాజిరెడ్డితో పాటు ప్రజా, మహిళా, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. 29 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోక పోవడంపై నాయకులు మండిపడ్డారు. కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మనసు మారి ఆర్టీసీ కార్మికుల పట్ల మంచి నిర్ణయం తీసుకోవాలని గంటపాటు ఈ మౌన దీక్ష చేశామని అశ్వత్థామరెడ్డి తెలిపారు.
ఇ ప్పటికైనా సీఎం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలన్నారు.

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: Eenadu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *