నాగశౌర్య.. ఓ మై గాడ్‌: సమంత

హైదరాబాద్‌: యువ కథానాయకుడు నాగశౌర్య వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్నారు. ఆయన తన తర్వాతి సినిమా కోసం జిమ్‌లో తెగ కసరత్తులు చేస్తున్నారు. మునుపటి కంటే ఇంకా ఫిట్‌గా తయారయ్యారు. వ్యాయామశాలలో తీసుకున్న ఓ ఫొటోను నాగశౌర్య శనివారం సాయంత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. తన తండ్రి సలహా మేరకు దాన్ని ఫాలోవర్స్‌తో షేర్‌ చేసుకున్నట్లు తెలిపారు. ‘డాడీ నన్ను ఈ ఫొటో పోస్ట్‌ చేయమన్నారు. నేను క్యాప్షన్‌ పెట్టి పోస్ట్‌ చేసే లోపు, తిట్టి నాతో ఏ క్యాప్షన్‌ లేకుండా ఇలా పోస్ట్‌ చేయించారు’ అని పేర్కొన్నారు. దీన్ని చూసిన సమంత సరదాగా స్పందించారు. ‘ఓ మై గాడ్‌.. వాట్‌ ఈజ్‌ దిస్‌ క్రేజీనెస్‌’ అని నవ్వుతున్న ఎమోజీని షేర్‌ చేశారు.

నాగశౌర్య, సమంత నటించిన ‘ఓ బేబీ’ ఈ ఏడాది విడుదలై, మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాగశౌర్య రమణ తేజ దర్శకత్వంలో నటిస్తున్నారు. మెహరీన్‌ కథానాయిక. మరోపక్క సంతోష్‌ జాగర్లపూడి తెరకెక్కించనున్న సినిమాలోనూ ఆయన నటించబోతున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని ఇటీవల నిర్వహించారు. సామ్‌ ’96’ తెలుగు రీమేక్‌ షూటింగ్‌ను ఇటీవల పూర్తి చేసుకున్నారు.

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: Eenadu

(Visited 1 times, 1 visits today)
The Logical News

FREE
VIEW
canlı bahis