నా అందమైన సోదరుడు షారూక్‌కు..

మమతాబెనర్జీ పుట్టినరోజు శుభాకాంక్షలు

కోల్‌కతా: బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారూక్‌ ఖాన్‌ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్విటర్‌ వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. షారూక్‌ వంటి వ్యక్తి బెంగాల్‌కు ప్రచారకర్తగా ఉండటం తమకు గర్వకారణమని కొనియాడారు.

‘షారూక్‌ఖాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా అందమైన సోదరుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి, జీవితంలో ఇంకెన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా. మీరు బెంగాల్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండటం మాకు గర్వకారణం. మీ సినిమాలతో మమ్మల్ని మరింత ఆనందింపజేయాలి’ అని దీదీ ట్విటర్లో పేర్కొన్నారు.
త్వరలో జరగబోయే 25వ కోల్‌కతా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో కలుద్దామని అన్నారు. ఈ సందర్భంగా షారూక్‌తో కలిసి ఉన్న ఫొటోను ఆయన పంచుకున్నారు.

నవంబరు 8న మమతా బెనర్జీ కోల్‌కతా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ వేడుకలను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి షారూక్‌ సహా పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు హాజరుకానున్నారు.

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: Eenadu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *