పవన్ లాంగ్ మార్చ్ కి గంటా, అయ్యన్న, అచ్చెన్న…!!

జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖలో రేపు లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ లాంగ్ మార్చ్ లో లక్షలాదిమంది భవన నిర్మాణ రంగ కార్మికులు పాల్గొంటారని పవన్ ప్రకటించారు. విశాఖనగరంలోని మద్దిలపాలెం తెలుగుతల్లి విగ్రం నుంచి లాంగ్ మార్చి రేపు మధ్యాహ్నం రెండు గంటలకు మొదలవుతుంది. రెందున్నర కిలోమీటర్ల దూరం వరకూ సాగి నగరంలోని పాత జైల్ రోడ్డు వద్ద ఉన్న మహిళా కళాశాల వద్ద ముగుస్తుంది. అక్కడ సభ కూడా నిర్వహిస్తారు. కాగా ఈ లాంగ్ మార్చ్ లో పాల్గొనాలని ఇప్పటికే పవన్ అన్ని రాజకీయ పక్షాలను కోరారు.

అయితే బీజేపీ మొదట్లోనే రాలేమని చెప్పేయగా ఈ రోజు సీపీఐ, సీపీఎం కూడా తాము లాంగ్ మార్చ్ కి రావడం లేదని కచ్చితంగా చెప్పేశాయి.
బీజేపీని పిలిచినందుకే తాము రావడంలేదని కూడా చెప్పాయి. ఇపుడు టీడీపీ నుంచే పవన్ కి ఆశ కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు లాంగ్ మార్చ్ కి మద్దతు ప్రకటించినందువల్ల తమ పార్టీ నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ముగ్గురు మాజీ మంత్రులను పంపుతున్నారని భోగట్టా.

ఆ మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన కింజరపు అచ్చెన్నాయుడుగా పేర్కొంటున్నారు. శ్రీకాకుళం, విశాఖలల్లో హ్హవన నిర్మాణ కార్మికులు పెద్ద సంఖ్యలో ఉండడం చేత వీరిని బాబు ఎంపిక చేశారని అంటున్నారు. ఇక ఈ ముగ్గురిలో ఇద్దరు కచ్చితంగా పవన్ లాంగ్ మార్చ్ కి రావడం ఖాయం. అయితే గంటా వస్తారా అన్నదే ఇక్కడ డౌట్ గా ఉంది. దానికి కారణాలు ఉన్నాయి. గంటా ఈ మధ్య కాలంలో టీడీపీకి దూరంగా ఉంటున్నారు.

అదే సమయంలో ఆయన టీడీపీ ఈ మధ్య నిర్వహించిన ఇసుక పోరాటంలో కూడా పాల్గొనలేదు. దాంతో ఇపుడు పవన్ ఆందోళనలో కనిపిస్తారా అన్న చర్చ కూడా ఉంది. ఇక పవన్ గత ఏడాది విశాఖ పర్యటనలో ప్రధానంగా గంటానే టార్గెట్ చేశారు. ఆయన్ని దారుణంగా విమర్శించారు. దాంతో పవన్ లాంగ్ మార్చ్ కి గంటా హాజరు కావడం డౌటేనని అంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: Telugu Ap Herald