సీఎం డెడ్ లైన్ … విధుల్లో చేరిన కార్మికుడు

ఆర్టీసీ కార్మికులు చేస్తోన్న సమ్మెను భేషరతుగా విరమించి ఈనెల ఐదవ తేదీలోగా విధుల్లో చేరాలని కేబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ డెడ్ లైన్ విధించగా, అప్పుడే ఒక అసిస్టెంట్ డిపో మేనేజర్ విధుల్లో చేరుతున్నట్లు . డిపో మేనేజర్ కు సమ్మతి పత్రాన్ని అందజేశాడు. ఉప్పల్ డిపో లో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తోన్న కేశవకృష్ణ , ఈనెల ఐదవ తేదీ నుంచి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ , జెఎసి పిలుపు మేరకు సమ్మె లో పాల్గొంటున్నాడు . అయితే శనివారం సాయంత్రం కేబినెట్ భేటీ అనంతరం ముఖ్యమంత్రి పిలుపు మేరకు ఆదివారం విధుల్లో చేరాడు . కేబినెట్ భేటీ లో ఆర్టీసీ పై మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలను తీసుకున్న విషయం తెల్సిందే .

రాష్ట్రం లోని పలు రూట్లను ప్రయివేట్ పరం చేస్తున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ , ఈనెల ఐదవతేదీ అర్ధరాత్రి లోగా సమ్మె చేస్తున్న కార్మికులు భేషరతుగా విధుల్లో చేరకపోతే , మిగతా రూట్లను కూడా ప్రయివేటుపరం చేసేందుకు రెడీ గా ఉన్నట్లు ప్రకటించారు . ముఖ్యమంత్రి ప్రకటనతో ఆర్టీసీ కార్మికుల్లో ఆందోళన మొదలయినట్లు కన్పిస్తోంది . ప్రస్తుతానికి కేశవ్ కృష్ణ విధుల్లో చేరుతున్నట్లుగా ప్రకటించగా , మిగిలిన కార్మికులు విధుల్లో చేరుతారా? , లేకపోతే సమ్మె ను యధావిధిగా కొనసాగిస్తారా ? అన్నది ఆసక్తికరంగా మారింది . ముఖ్యమంత్రి ప్రకటన నేపధ్యం లో జెఎసి నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు .

ఉద్యోగులను తొలగించే అధికారం ఎవరికీ లేదని , తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని జెఎసి నేతలు తేల్చి చెప్పారు . సీఎం డెడ్ లైన్లు పెట్టడం కొత్తేమి కాదని , తొలుత కార్మికులతో చర్చలు జరిపి ఆ తరువాత డెడ్ లైన్లు పెట్టాలని అన్నారు . ఎవరో ఇద్దరు , ముగ్గురు పిరికివాళ్ళు సమ్మె విరమించి విధుల్లో చేరుతున్నారన్న జెఎసి నేతలు , మిగిలిన కార్మికులంతా సమ్మెలో పాల్గొంటున్నారని చెప్పారు .

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: Telugu Ap Herald

(Visited 1 times, 1 visits today)
The Logical News

FREE
VIEW
canlı bahis