ఆ ఒక్క పనితో పోలీసు కుటుంబాల మనసు గెలుచుకున్న జగన్..?

కరోనా సమయంలో ఇప్పుడు వైద్యులు , పోలీసులు , అధికారులు దేవుళ్లుగా మారారు . అందరి కంటే ఎక్కువగా కరోనాతో సావాసం చేస్తూనే దానితో పోరాడుతున్నారు వైద్యసిబ్బంది . వారి కష్టానికి , త్యాగానికి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే . వారి తర్వాత చెప్పుకోవాల్సింది పోలీసులనే .. రేయనక , పగలనక డ్యూటీలు చేస్తూ .. ప్రజలను కట్టడి చేస్తున్నారు .

వృత్తి రీత్యా వారు కూడా కరోనాతో సావాసం చేస్తూనే పోరాడుతున్నారు . ఏపీలో ఇటీవల ఓ ఎస్సై లాక్ డౌన్‌ లో విధులు నిర్వర్తిస్తూ .. కరోనా బారిన పడ్డాడు . ప్రాణాలు వదిలాడు . లాక్‌డౌన్‌లో విధులు నిర్వర్తిస్తూ కరోనా తో మృతి చెందిన పరిగి ఏఎస్ఐ కుటుంబానికి ఏపీ సర్కారు 50 లక్షల రూపాయల సాయం ప్రకటించింది . వెంటనే ఆ సొమ్మును ఆయన కుటుంబానికి అందించింది .

చనిపోయిన మనిషిని తీసుకురాలేకపోయినా .. ఇలాంటి కష్టకాలంలో మీకు మేం అండగా ఉన్నామనే భరోసా నింపింది ఏపీ సర్కారు . అందుకే ఏపీ సీఎం జగన్ కు డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ కృతజ్ఞతలు తెలిపారు . పోలీసు కుటుంబాన్ని సకాలంలో ఆదుకున్నందుకు థ్యాంక్స్ చెప్పారు . ఏపీకి విదేశాల నుంచి 28000 మంది , ఢిల్లీ జమాత్‌ నుంచి 1185 మంది వచ్చారు .. వారందరిని క్వారంటైన్‌లో ఉంచామని డీజీపీ ఇదే సమయంలో వివరించారు .

దేశంలోనే అత్యధిక మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న ఘనత ఏపీ ప్రభుత్వానికే దక్కుతుందని డీజీపీ అంటున్నారు . కరోనాపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు . కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు తగవని డీజీపీ గౌతమ్ సవాంగ్ హితవు పలికారు . ఏదేమైనా కరోనా సమయంలో పోలీసులు చేస్తున్న సేవలను సమాజం గుర్తు పెట్టుకుంటుంది .

కేసీఆర్‌ని టార్గెట్ చేసిన రేవంత్-రాములమ్మ…అది సాధ్యం అవుతుందా?

రాజకీయ వైరస్: మమత ఎందుకు ఇలా చేస్తున్నారు? మోదీతో ఇబ్బందా?

కరోనా వాస్తవం : దోమలతోనూ కరోనా వ్యాపిస్తుందా…?

బిగ్ బ్రేకింగ్‌: తెలంగాణలో కరోనా కేసులు 990

భారత్‌లో 25 వేలకు చేరిన కరోనా కేసులు.. 24 గంటల్లో 56 మరణాలు!

చరణ్ మీద చిరు షాకింగ్ కామెంట్స్ ?

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ – Chakravarthi Kalyan

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: Telugu Ap Herald

(Visited 1 times, 1 visits today)
The Logical News

FREE
VIEW
canlı bahis