కరోనా కంటే చంద్రబాబును ఎక్కువగా బాధ పెడుతున్నది అదేనా..?

కరోనా ఇప్పుడు ఇది ప్రపంచం బాధ .. ఈ కరోనా మహమ్మారిని ఎలా తరిమేయాలి .. దీని బారి నుంచి ప్రజలను ఎలా కాపాడుకోవాలి .. కరోనా నష్టాలను , కష్టాలను ఎలా అధిగమించాలి .. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నాయకుల బుర్రలకు పదను పెడుతున్న ప్రశ్నలివే .. అయితే ఇప్పుడు ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మాత్రం ఇంత కంటే ఎక్కువగా బాధ పెడుతున్న అంశాలు వేరే ఉన్నాయట .

అదేంటో తెలుసా .. రాజధానిని ఎక్కడ విశాఖకు తరలిపోతుందో అన్న భావనేనట . ఇది కరోనా కంటే ఎక్కువగా చంద్రబాబును బాధిస్తోందట . వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు విమర్శలు ఇవి . విశాఖకు వ్యతిరేకంగా అనేక పిటిషన్లను కోర్టులో వేయించడం వెనుక విశాఖపై చంద్రబాబుకు ఉన్న విష సంస్కృతికి నిదర్శనమని దాడి వీరభద్రరావు మండిపడుతున్నారు .

చంద్రబాబు ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఇంకా తానే అధికారంలో ఉన్నాననే భ్రమలో ఉన్నారని దాడి వీరభద్రరావు విమర్శించారు . ఇంకా అధికారులను చంద్రబాబు ఇంకా తన గుప్పెట్లో ఉంచుకోవాలనే భావనతోనే ఉన్నారంటున్నారు . అందుకే .. అధికారంలో ఉన్నట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారని దాడి వీరభద్రరావు దుయ్యబట్టారు . మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ రమేష్ కేంద్రానికి రాశారని చెబుతున్న లేఖ ఆయన రాసింది కాదని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన ఫిర్యాదు వాస్తవం అని తేలిందని దాడి అంటున్నారు .

అటు చంద్రబాబు సైతం వైసీపీ విమర్శలకు తగ్గట్టుగానే ప్రవర్తిస్తున్నారు . కరోనా కాలంలో హైదరాబాద్ లో ఉంటూ .. తరచూ మీడియా సమావేశాలు పెడుతూ .. కరోనాపై ఎలా పోరాటం చేయాలో జగన్ కు సలహాలు ఇస్తూ ఉంటున్నారు . పాపం .. ఛాన్స్ లేదు కానీ .. లేకపోతే .. చంద్రబాబు రోజూ కరోనాపై అధికారులతో సమావేశాలు నిర్వహించేవారు కూడా అంటున్నారు వైసీపీ నాయకులు .

మర్కజ్ కరోనా కేసుల గురించి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్‌ని టార్గెట్ చేసిన రేవంత్-రాములమ్మ…అది సాధ్యం అవుతుందా?

రాజకీయ వైరస్: మమత ఎందుకు ఇలా చేస్తున్నారు? మోదీతో ఇబ్బందా?

కరోనా వాస్తవం : దోమలతోనూ కరోనా వ్యాపిస్తుందా…?

బిగ్ బ్రేకింగ్‌: తెలంగాణలో కరోనా కేసులు 990

భారత్‌లో 25 వేలకు చేరిన కరోనా కేసులు.. 24 గంటల్లో 56 మరణాలు!

చరణ్ మీద చిరు షాకింగ్ కామెంట్స్ ?

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ – Chakravarthi Kalyan

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: Telugu Ap Herald

(Visited 13 times, 1 visits today)
The Logical News

FREE
VIEW
canlı bahis