చిరంజీవి సుజిత్ కు పెడుతున్న ఆ మూడు పరీక్షలు !

‘లూసిఫర్’ మూవీ రీమేక్ చిరంజీవి దర్శకుడు సుజిత్ కు అప్పచేప్పడానికి వెనుక పెద్ద వ్యవహారమే నడిచింది అన్నవార్తలు ఇప్పటికే వచ్చాయి. హీరో ప్రభాస్ రామ్ చరణ్ దగ్గర ‘లూసిఫర్’ రీమేక్ కు సుజిత్ అన్నివిధాల న్యాయం చేస్తాడు అని గట్టిగా చెప్పడంతో చరణ్ పట్టుపట్టడంతో ఈమూవీ రీమేక్ కు చిరంజీవి సుజిత్ విషయంలో ఓకె చెప్పినా చిరంజీవి మాత్రం మూడు కండిషన్స్ ఈమూవీ రీమేక్ కు సంబంధించి సుజిత్ కు పెట్టడమే కాకుండా ఆ కండిషన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఈరీమేక్ స్క్రిప్ట్ ను తయారు చేయమని చెప్పడంతో ప్రస్తుతం సుజిత్ తన టీమ్ తో కలిసి ఈలాక్ డౌన్ సమయంలో చిరంజీవి సూచనలకు అనుగుణంగా స్క్రిప్ట్ రచనలలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ‘లూసిఫర్’ మూవీలో ఎటువంటి డ్యూయెట్స్ కాని స్పెషల్ సాంగ్స్ కానీ లేవు. వాస్తవానికి ఈమూవీలో మోహన్ లాల్ పక్కన హీరోయిన్ కూడ లేదు. అయితే ఈమూవీ తెలుగు రీమేక్ విషయం వచ్చే సరికి చిరంజీవి నటించబోయే మోహన్ లాల్ పాత్రకు ఒక హీరోయిన్ ను అదేవిధంగా రెండు డ్యూయెట్స్ ను ఒక స్పెషల్ సాంగ్ ను క్రియేట్ చేసే విధంగా ఈమూవీ స్క్రీన్ ప్లే మార్చమని చిరంజీవి సుజిత్ కు సలహా ఇచ్చినట్లు టాక్.

అదేవిధంగా ‘లూసీఫర్’ మూవీలో కేరళా రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాల ప్రస్తావనతో పాటు కొంతమంది రాజకీయ నాయకులను పరోక్షంగా టార్గెట్ చేసే విధంగా మోహన్ లాల్ డైలాగ్స్ ఉన్నాయి. అయితే తెలుగు రీమేక్ విషయానికి వచ్చే సరికి ఈమూవీ స్క్రిప్ట్ లో కాని డైలాగ్స్ లో కాని ఎలాంటి వివాదాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోమని సుజిత్ కు చిరంజీవి చాల స్పష్టమైన సూచనలు ఇచ్చాడు అన్న వార్తలు కూడ ఉన్నాయి.

ముఖ్యంగా ‘లూసిఫర్’ మూవీలో మోహన్ లాల్ పాత్రతో పాటు అతడి సవితి సోదరుడి పాత్ర కూడ ఉంటుంది. ఈపాత్ర పరిధి పెంచి పవన్ కళ్యాణ్ ఆశయాలకు సిద్ధాంతాలకు పరోక్షంగా సహకరించే విధంగా ఆపాత్రను పెంచమని చిరంజీవి సుజిత్ కు చెప్పాడు అన్న లీకులు కూడ వస్తున్నాయి. దీనితో ఈమూవీలో చిరంజీవి తన సోదరుడు పాత్ర ద్వారా పవన్ ప్రస్తావన తీసుకు వచ్చి తమ మెగా బ్రదర్స్ మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని మెగా అభిమానులకు పూర్తిగా అర్థం అయ్యే విధంగా చిరంజీవి సరికొత్త వ్యూహం తన ‘లూసిఫర్’ రీమేక్ లో అనుసరిస్తున్నాడు అంటూ వస్తున్న వార్తలను బట్టి ఈమూవీ రీమేక్ లో పవన్ నటించకపోయినా పరోక్షంగా ఈమూవీలో పవన్ జనసేన సిద్ధాంతాలు వినిపించబోతున్నాయి అంటూ జరుగుతున్న ప్రచారం బట్టి చిరంజీవి సుజిత్ కు పెద్ద పరీక్షలు పెట్టాడు అనుకోవాలి..

కరోనా విషయంలో తెలంగాణను దాటేసిన ఆంధ్రప్రదేశ్.. ఆ సీక్రెట్ ఏంటంటే..?

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ – Seetha Sailaja

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: Telugu Ap Herald

(Visited 1 times, 1 visits today)
The Logical News

FREE
VIEW
canlı bahis