లాస్య కెరీర్ ఎందుకు ఆగిపోయింది…?

టాలీవుడ్ లో యాంకర్ గా సుమా స్థానాన్ని భర్తీ చేస్తుంది అనుకున్న యాంకర్ లాస్య. వరుస అవకాశాలతో ఒకానొక సమయంలో ఆమె దూసుకుపోయింది. అవకాశం వస్తే చాలు అనుకున్న సమయంలో ఆమెకు పెద్ద ఛానల్స్ లో అవకాశాలు చాలానే వచ్చాయి. అయినా సరే ఆమె కెరీర్ దాదాపుగా ఆగిపోయింది. ఎన్ని అవకాశాలు వచ్చినా సరే ఆమె కెరీర్ లో నిలబడలేదు. టాలీవుడ్ లో మంచి పరిచయాలు ఉన్నా సరే ఆమె కెరీర్ ని మాత్రం నిలబెట్టుకోలేదు అని అంటారు టాలీవుడ్ జన౦. టాలీవుడ్ లో ఆమె గనుక నిలబడి ఉంటే మంచి యాంకర్ అయి ఉండేది.

ఈ విషయం చాలా మందికి స్పష్టత ఉంది. మరి ఏమైందో ఏమో తెలియదు గాని కెరీర్ ఆగిపోయింది. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం పిల్లలు అంటూ ఆమె వెళ్లిపోయింది.
అయితే ఆమె కెరీర్ ఆగిపోవడానికి ఒక మెల్ యాంకర్ కారణం అని అంటారు టాలీవుడ్ జనం. అతనితో ఆమెకు ఉన్న పరిచయం చాలా మందికి అసలు నచ్చలేదు అని ఆమెకు ఎన్ని సార్లు చెప్పినా సరే ఆమె మాత్రం వినలేదు అని అంటారు. ఆమె కెరీర్ కి అది ఇబ్బంది అని చెప్పినా సరే ఆమె మాత్రం మొండిగా ముందుకు వెళ్ళింది అంటారు.

అతని వలన ఆమెకు ఏ ఉపయోగం లేకపోయినా సరే అతని తో ఆమె స్నేహం వద్దని చాలా మంది పదే పదే చెప్పారట. అయినా సరే ఆమె మాత్రం వారి మాటను ఏ విధంగా కూడా ఆసలు పట్టించుకునే ప్రయత్నం చేయలేదు అని అంటారు. అతని తో ఆమెకు ప్రేమ కూడా ఉందని టాలీవుడ్ లో టాక్. అందుకే చాలా మంది ఆమెకు ఆఫర్లు ఇవ్వడానికి ముందుకు వచ్చిన పరిస్థితి లేదు అని ఆమె ట్రై చేసినా సరే ఆఫర్లు రాలేదట.

కరోనా విషయంలో తెలంగాణను దాటేసిన ఆంధ్రప్రదేశ్.. ఆ సీక్రెట్ ఏంటంటే..?

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ – Gullapally Venkatesh

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: Telugu Ap Herald

(Visited 1 times, 1 visits today)
The Logical News

FREE
VIEW
canlı bahis