నిరుద్యోగ భృతి ప్రకటించాలని డిమాండ్‌

మల్లాపూర్‌ (మేడ్చల్‌): తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రూ.10,000 నిరుద్యోగ భృతి ప్రకటించాలని అఖిల భారత యువజన సంఘం మేడ్చల్‌ జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు సత్యప్రసాద్‌, ధర్మేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం మల్లాపూర్‌ డివిజన్‌లో ఆ సంఘం 61వ వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకొని జెండా ఎగురవేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… దేశ భవిష్యత్‌లో యువత పాత్ర కీలకమని అన్నారు. విద్య, వైద్య, ఉపాధి హక్కుల సాధనకు ఏఐవైఎఫ్‌ నిరంతర పోరాటం సాగిస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని పలు శాఖల్లో ఖాళీగా ఉన్న 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు రాజేష్‌, సీతారాంరెడ్డి, సచిన్‌, శివ, రాము తదితరులు పాల్గొన్నారు.

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: Eenadu

(Visited 1 times, 1 visits today)
The Logical News

FREE
VIEW
canlı bahis